చిన్న గాయం.. పెద్ద ప్రమాదం
- జిల్లాలో పెరుగుతున్న సెల్యులైటిస్ కేసులు
- డాక్టర్ మనోజ్ కుమార్ జనరల్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్
నిజామాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి) :- ఒక చిన్న గాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అది సెల్యులైటిస్‌గా మారి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని మెడికవర్ హా స్పిటల్స్, నిజామాబాద్ జనరల్ సర్జన్ డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో డయాబెటిస్, రక్తప్రసరణ సమస్యలు, గాయాలు, పాదాల పరిశుభ్రత లో పించడం వంటి కారణాలతో సెల్యులైటిస్ కే సులు పెరుగుతున్నాయన్నారు. సెల్యులైటిస్ అనేది చర్మం, చర్మం కింద ఉండే మృదు కణజాలంలో బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్.
సాధారణంగా కాళ్లు, పాదాలు, చేతుల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుందన్నారు. చిన్న గాయం, గీత, పగుళ్లు, పురుగు కాటు వంటి వాటి ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని, ముఖ్యంగా మధుమేహం, ఊబకా యం, రక్తప్రసరణ లోపం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. సెల్యులైటిస్ ప్రారంభ దశలో కాలు లేదా ప్రభావిత భా గం ఎర్రగా మారడం, వాపు రావడం, నొ ప్పి, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొందరిలో జ్వరం, వణుకు, అ లసట కూడా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిం చి తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు అని తెలిపారు. సమయానికి చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి సెప్సిస్, నెక్రో టైజింగ్ ఫాసియాటిస్, గ్యాంగ్రీన్ వంటి ప్రా ణాపాయ పరిస్థితులకు దారితీయొచ్చునన్నారు. నివారణకు తీసుకోవాల్సిన జా గ్ర త్తలు ఆయన సూచించారు. గాయాలను పరిశుభ్రంగా ఉంచాలి.. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచాలన్నారు.
పాదాల్లో గాయాలు, పగుళ్లు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. పరిశుభ్రమైన పాదరక్షలు ధరించాలి. చర్మంపై గా యాలు లేదా ఇన్ఫెక్షన్ కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. కాలు ఎర్రబడటం, వాపు, నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే జనరల్ సర్జన్‌ను సంప్రదిస్తే ప్రా రంభ దశలోనే యాంటీబయో టిక్స్తో చికిత్స చేసి పూర్తిగా నయం చేయొచ్చునన్నారు. మధుమేహం ఉన్నవారు చిన్న గాయాన్నైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యమన్నారు.






