17న రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రులచే శంకుస్థాపన
13-08-2026 05:05 PM
సభా స్థలమును పరిశీలించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో పూసల రోడ్డులో సుల్తానాబాద్ టు పెద్దాపూర్ వరకు రోడ్డు , సెంట్రల్ లైటింగ్ పనులకు గాను ఈ నెల 17న ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , తుమ్మలనాగేశ్వరరావు , దుద్దిల్ల శ్రీధర్ బాబు లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గురువారం పూసల రోడ్డులోని సభాస్థలిని మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ , మున్సిపల్ కమిషనర్. టి రమేష్ , కౌన్సిలర్లు , ఆర్ అండ్ బి ఏ ఈ గుణశేఖర్ సభాస్థలి ని పరిశీలించారు.






