13 August, 2026 | 6:32 PM

భూపాలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాట్ల శ్రీనివాస్

13-08-2026 05:11 PM

శ్రీనివాస్ కు శుభాకాంక్షల వెల్లువ

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): భూపాలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాట్ల శ్రీనివాస్ గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా దాట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి భూపాలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, రాబోయే రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా మళ్లీ ఎగిరేలా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు. పట్టణ అధ్యక్షులుగా దాట్ల శ్రీనివాస్ నియామకం పట్ల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.