calender_icon.png 5 February, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంది

05-02-2026 12:55:56 AM

ప్రాజెక్టుల పేరుతో కమిషన్ లు దండుకుంది 

మెదక్ లో మంత్రి వివేక్ వెంకట స్వామి

మెదక్, ఫిబ్రవరి 4(విజయ క్రాంతి): ప్రజలు కాంట్రిబ్యూషన్ చేసుకొని తెలంగాణ కోసం ఉద్యమం చేశారని, కానీ బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుందని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. బుధవారం మెదక్ లో ఆయన మాట్లాడుతూ...కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఆకాశ మంత ఎత్తుకు పెంచుకున్నారని, బీ ఆర్ ఎస్ పార్టీ కి 800 కోట్ల డిపాజిట్ లు ఉన్నాయన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు కానీ.... అప్పటి సీ ఎం కే సీ ఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. కవిత చేస్తున్న ఆరోపణలను వారెవరు తిప్పికొట్టడం లేదన్నారు.

ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పుల పాలు చేసిందన్నారు. మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తున్నాం. ఈ స్కీమ్ కోసం ఇప్పటి వరకు 9 వేల కోట్లు ఖర్చు చేశాం. మహిళలు నెలకి 3 వేలు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. మహిళ శక్తి కింద మహిళా సంఘాల వారికి బ్యాంక్ లింకేజీ కింద 23 వేల కోట్లు మంజూరు చేశామని, వడ్డీ లేని రుణాలు చెల్లించడం జరిగిందన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం... త్వరలో మహిళలకు నెలకు 2,500 ఇచ్చే స్కీమ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 శాతం కౌన్సిలర్ స్థానాల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవ బోతుండగా, మెదక్ లో 90 శాతం గెలుస్తారని నమ్మకం ఉందన్నారు.