29 May, 2026 | 8:03 PM

బీజేపీ వాళ్లు చేసేది రైతుగోస కాదు.. 'అధికార గోస'

29-05-2026 04:34 PM

హైదరాబాద్: బీజేపీ నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు, మైక్ దొరికితే అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నారని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) నిర్వహించిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో పంట అంత కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం పంట కొనుగోలుపై ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఏ రాష్ట్రంలో అయినా మొక్కజోన్న కొనుగోలు చేస్తుందా? అని ప్రశ్నించారు. కేంద్రం మొక్కజొన్నలకు మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ వాళ్లు చేసేది రైతు గోస కాదు.. మీ అధికార గోస అన్నారు.