calender_icon.png 19 February, 2026 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన కౌన్సిలర్లను అభినందించిన మంత్రి తుమ్మల

19-02-2026 12:29:10 AM

సత్తుపల్లి ఫిబ్రవరి 18. (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. బుధవారం పట్టణ పరిధిలోని కాకర్ల రోడ్డులో గల సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుండ్ల నరసింహారావు గృహంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కోరారు.

మున్సిపల్ చైర్మన్ రెహనా బేగం కమల్ పాషాని, వైస్ చైర్మన్ బొంతు సుమలతని, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్ ని, కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ ని, కోటేశ్వరిని, కల్లూరు మున్సిపల్ కౌన్సిలర్ ని అందరికి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్  మట్టా దయానంద్, సత్తుపల్లి, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు, మహిళా, యూత్, NSUI నాయకులు పాల్గొన్నారు.