11 July, 2026 | 1:50 PM

Breaking News

రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •   గొడుగులు పంపిణీ చేసిన ఎడెల్లి శ్రీనివాస రెడ్డి   •   కడ్పల్ లో పాము కాటుకు రైతు మృతి   •  

వెంకటాపురం గ్రామంలో చింతామణి నాటక ప్రదర్శన

19-02-2026 12:27 AM

ఎర్రుపాలెం ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మహా శివ రాత్రి పర్వదిన సందర్బంగా మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో  తెలంగాణ బాషాసాంసృతిక మరియు సంగీత నాటక అకాడమీ వారి సౌజన్యముతో శ్రీ గణపతి సర్దార్ జమలాపురం కేశవరావు కళా నాట్యమండలి జమలాపురం వారుచింతామణి నాటకం నుండి భవాని లవ్ సీన్ సత్య హరిచంద్ర పూర్తి నాటకాన్ని రసవంతంగా ప్రదర్శించారు.

గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు వేముల వెంకటేశ్వరరావు, కర్నాటి సుధాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవానిగా ముల్లంగి గాబ్రియేలు, చింతామణిగా నాగలక్ష్మి అదేవిధంగా ఒకటవ హరిశ్చంద్రునిగా రాజేశ్వరరావు, రెండవ హరిశ్చంద్రునిగా బూసిరెడ్డి, మూడవ హరిశ్చంద్రునిగా రామచంద్రరావు, నాల్గవ హరిశ్చంద్రుడిగా గంగాధర్, విశ్వామిత్రునిగా రమణారావు, ఒకటవ నక్షత్రకునిగా కిషోర్ రెడ్డి, రెండవ నక్షత్రకునిగా గాబ్రియేలు, ఒకటవ చంద్రమతిగా నాగలక్ష్మి, రెండవ చంద్రమతిగా రమణి ఇంకా రాములు, నాగరాజు, కే ఎల్ బి రావు, కాల కౌశికునిగా  శేషిరెడ్డి తదితరులు అద్భుతంగా నటించారు. సంగీతం: రమణ హార్మోనియం, సాయి డోలక్, డ్రెస్ అండ్ మేకప్ భద్రారెడ్డి, మైక్ అండ్ లైటింగ్ రెడ్డి సౌండ్స్ వారు వ్యవహరించారు.