16 August, 2026 | 6:49 PM

హైదరాబాద్‌తో సమానంగా ములుగు అభివృద్ధి: మంత్రి సీతక్క

16-08-2026 04:53 PM

ములుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు అంటే అడవులు, అభివృద్ధి లేని ప్రాంతం అనేవారని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ములుగు జిల్లా అభివృద్థి చెందుతోందని తెలిపారు. హైదరాబాద్ తో సమానంగా ములుగు అభివృద్ధి చెందుతోందని సీతక్క సూచించారు. 10 ఏళ్లగా కొట్లాడితే 33వ జిల్లాగా ములుగును ఇచ్చారని స్పష్టం చేశారు.

ఎన్నికల ముందే ములుగు కలెక్టరేట్ కు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఏడాదిలో మూడు సార్లు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం ... రేవంత్ రెడ్డేనని సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలకు ఇవ్వనన్ని ఇందిరమ్మ ఇళ్లు ములుగు జిల్లాలకు ఇచ్చారని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (Integrated District Office Complex) ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “మంత్రి సీతక్క నా తోడబుట్టిన సోదరి కాకపోయినా.. సొంత ఆడబిడ్డలెక్క భావిస్తున్నా. కానీ ఒకడు ఉన్నాడు.. సొంత చెల్లినే ఆస్తి కోసం ఇంటి నుంచి వెళ్లగొట్టాడు” అని వ్యాఖ్యానించారు.