16 August, 2026 | 6:52 PM

కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

16-08-2026 04:40 PM

భైంసా (విజయక్రాంతి): ముధోల్ మండల కేంద్రంతో పాటు తానూర్ మండలంలోని ఎల్వాత్ గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ ఆదివారం పరామర్శించారు మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.