9 May, 2026 | 1:28 AM

ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

09-05-2026 12:03 AM

రక్తదానం శిబిరం, మెడికల్ క్యాంప్ నిర్వహణ

హైదరాబాద్, మే 8(విజయక్రాంతి): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, కార్యకర్తలు శుక్రవారం నాడిక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా స్థానిక గ్రీన్ హౌస్, మంకమ్మ తోటలో వాసుదేవా హాస్పిటల్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137-ఏ, కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం, మధుమేహ నిర్ధారణ పరీక్షలు, కంటి పరీక్షలు, మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

ఈ క్యాంపులో సుమారు 100 మందికి షుగర్, కంటి పరీక్షలు నిర్వహించగా, 20 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వాసుదేవా హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ తమ సొంత ఖర్చులతో ఉచితంగా మందులు, షుగర్ పరీక్షలు నిర్వహించడం విశేషం.

కార్యక్రమంలో డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, డాక్టర్ సాయి మేఘ న, డాక్టర్ సాయి ప్రీతం, డాక్టర్ సాయికుమార్, డాక్టర్ సునీల్ రాజ్, డాక్టర్ అశోక్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, జిల్లా గవర్నర్ కొం జర్ల మహేష్, పులాల శ్యామ్, సాగర్ రెడ్డి, సోమవారపు వెంకన్న, సుధాకర్, ఈద కు మారస్వామి, నాగేశ్వరరావు, నాజియా, అనూష రెడ్డి, ప్రసాద్, పండుగ నాగరాజు, అచీవర్స్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.