9 May, 2026 | 1:28 AM

రక్షణ రంగానికి హైదరాబాద్ ఆయువు పట్టు

09-05-2026 12:06 AM
  1. రాష్ట్రంలో 1500కు పైగా చిన్న, మధ్యతరహా ఏరోస్పెస్, రక్షణ రంగాలకు భాగస్వామ్యం
  2. ఎంఎస్‌ఎంతీ స్పార్క్- 3.0 కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): భారత రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారిందని సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఏరోస్పెస్, డిఫెన్స్ రంగాలు హైదరాబాద్‌లో శరవేగంగా పురోగమనం వైపు పయనిస్తున్నాయన్నారు. శుక్రవారం ఉదయం తాజ్ డెక్కన్‌లో జరిగిన ఎంఎస్‌ఎంఇ స్పార్క్- 3.0 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చాకా సిఏజిఆర్ ఎగుమతులలో తెలంగాణా రాష్ట్రం 103% సంయుక్త వార్షిక వృద్ధి రేటు నమోదు చేసుకున్నదని చెప్పారు. ఏరోస్పెస్, డిఫెన్స్ రంగాలలో ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో 1500కు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం అ నంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ రంగంపై నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకున్నందునే దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సంపత్తిలో 60% కి మించి సమకూర్చుకుందని పేర్కొన్నారు.

రక్షణకు సంబంధిం చిన ఎగుమతులు 34 రేట్లు పెరగడంతో, 686 కోట్ల ఆదాయం నుంచి 23,622 కోట్ల కు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. 2029 నాటికి మూడు లక్షల కోట్లు ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు పోతున్న భారతదేశానికి 50 వేల కోట్ల ఎగుమతుల లక్ష్యానికి చెరువులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రెండు దశాబ్దాలలో ప్ర పంచ మార్కెట్‌లో 10 లక్షల కోట్ల మేర మార్కెట్ అవకాశాలు రక్షణ రంగానికి లభిం చే అవకాశాలు ఉన్నాయన్నారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం ఏరోస్పెస్ రంగంలో యావ త్ భారతదేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలబడటం గర్వకారణంగా ఉందన్నారు. ఫైనాన్షి యల్ టైమ్స్, ఎఫ్‌డిఐ ర్యాం కింగులలో స్వల్ప సమయంలోనే తక్కువ వ్యయంతో హైదరాబాద్ కేంద్రం అనుకూల నగరంగా గుర్తింపు పొందడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రభు త్వ ప్రతిష్ఠతను నిలిపేదే అని ఆయన కొనియాడారు.

ఆదిబట్ల, జీఎంఆర్ ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటైన ఏరోస్పేస్ పార్కులు, ఎలిమినేడు, మెదక్ నిమ్జ్ ప్రాంతా ల్లో రానున్న కొత్త క్లస్టర్లు ప్రపంచ రక్షణ రంగ స్టార్టప్లకు సువర్ణావకాశాల వేదికలుగా రనున్నాయని ఆయాన చెప్పారు. అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏఐ, ఉపగ్రహ సాంకేతికత, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, సైబర్ భద్రత రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాలను చురుకుగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో విమానయాన రంగంలో అత్యు త్తమ ప్రతిభా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బ్రిటన్‌కు చెందిన క్రాన్ఫీల్ యూనివర్సిటీతో  ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.