తప్పులు సరిదిద్దుటకు ప్రత్యేక డ్రైవ్
నోటీసులు అందుకున్న ఓటర్లతో కలకలాడుతున్న తహశీల్దార్ కార్యాలయాలు
ఉట్నూర్, ఆగస్టు 29 ( విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసులలో ఓటర్ల పేర్లలో తప్పులను సరిదిద్దుటకు తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటీసులను ఓటర్లు పట్టుకొని శనివారం కార్యాలయాలకు చేరుకోవడంతో ఓటర్లతో కార్యాలయాలు కలకలలాడాయి. నోటీసులు అందుకున్న ఓటర్లు పూర్తి వివరాలతో హాజరు కావడంతో తహసిల్దారులు నోటీసుల పూర్తి వివరాలను, వారి వివరాల డాక్యుమెంట్లను పరిశీలించారు.
తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటర్ల నుండి జారీ చేసిన నోటీసులు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు తీసుకున్నారు. ఉట్నూర్ డివిజన్లోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరికొండ మండలాలలో ఓటర్ల నుండి తీసుకుని డాక్యుమెంట్లను ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్ పరిశీలించారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల తహసిల్దారులు ప్రవీణ్ కుమార్, రఘునాథ రావులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటర్ల నుండి నోటీసులతోపాటు డాక్యుమెంట్లను స్వీకరించారు.






