కోట్నాక భీమ్రావు ఆశయాలను కొనసాగించాలి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీల అభ్యున్నతి, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత మాజీ మంత్రి కోట్నాక భీమ్రావు ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్కులో కోట్నాక భీమ్రావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భీమ్రావు విగ్రహానికి ఎమ్మెల్సీ దండేవిటల్, అదనపు కలెక్టర్ డేవిడ్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు భీమ్రావు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగా, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సలాం, కార్తీక్, ఆదివాసీ సంఘం నాయకులు అర్జు మాస్టర్, మడవి శ్రీనివాస్, బుర్సా పోచయ్య, భీమ్రావు కుటుంబ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






