6 April, 2026 | 5:28 PM

కేరళలో మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచారం

06-04-2026 03:11 PM

కేరళలో మంత్రి పొంగులేటి, తెలంగాణ రాష్ట్ర నాయకులు మట్టా, ఎన్నికల ప్రచారం.

సత్తుపల్లి,(విజయక్రాంతి): కేరళలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అక్కడ ఉన్న ప్రజలకు కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలపై అవగాహన కల్పిస్తూ అలప్పుజా, మావెలికేర, ఆదూర్, అంబాలపూజ నియోజకవర్గాలలో ఇంటింటికి వెళ్లి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.