11 April, 2026 | 3:46 PM

Breaking News

ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •  

అంటారనితనం, కులవ్యవస్థ నిర్మూలనలో జ్యోతిరావు పూలే సేవలు అమోఘం

11-04-2026 01:55 PM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి,(విజయక్రాంతి): సమాజంలో అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన పై పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే(Jyotirao Phule Jayanti 2026) అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తీసుకువచ్చిన అనేక  సంస్కరణలు అణగారిన వర్గాల పాలిట వరంగా మారాయని అన్నారు. స్వేచ్ఛ సమానత్వం కోసం ఫూలే చేసిన సేవలు, పోరాటాలను చేశారని గుర్తు చేశారు.

మహిళలకు చదువు నేర్పిస్తే  సమాజం బాగుంటుందని భావించి తన భార్య సావిత్రిబాయి పూలే కు చదువు నేర్పించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలకు చదువు నేర్పించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధన అందరం కట్టుబడి ఉండాలి అని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి , మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, మున్సిపల్ కౌన్సిలర్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.