13 June, 2026 | 6:39 PM

Breaking News

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాథోడ్ ప్రకాష్   •   సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం   •   డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం   •   వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కత్తుల లింగస్వామి   •   ఘనంగా బిఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   పట్టణంలో కోతుల పట్టివేత   •   గోండి భాష నేర్చుకుంటా.. ఆదివాసీ గోండుల కట్టుబాట్లను ఆదర్శంగా తీసుకుంటా..   •   ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిబిరం   •   గాలికి కూలిన ఇంటికి చేయూత - 'మీకోసం మేమున్నాం టీం' ఆర్థిక సహాయం   •   అంగన్వాడీలే ముద్దు.. ప్రీ ప్రైమరీ స్కూళ్లు వద్దు..   •  

మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

13-06-2026 05:20 PM

చిట్యాల,(విజయక్రాంతి): తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిట్యాల పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం అయినా కడారి లింగయ్య యాదవ్ మనవడు జాల శివచరణ్, మనవరాలు సాయిరాణి పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. శనివారం ఈ విషయాన్ని చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

విద్యాభ్యాసం కొనసాగించేందుకు సాయిరాణికి ప్రైవేట్ కళాశాలలో సీటు ఇప్పించడంతో పాటు, కుటుంబ సభ్యులకు రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటానని, అనాథలుగా మారిన పిల్లల భవిష్యత్తు కోసం తన తరఫున అవసరమైన సహాయం అందిస్తానని అన్నారు. మంత్రి చూపిన ఉదారత, మానవత్వానికి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.