13 June, 2026 | 7:21 PM

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిబిరం

13-06-2026 06:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): అవొపా (ఆర్య వైశ్య ఆఫీసియల్ ప్రొఫషనల్ అసోసియేషన్ )నిర్మల్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ సౌజన్యంతో ఉచిత ఆర్థోపెడిక్ మెడికల్ హెల్త్ క్యాంప్ ను శనివారం నిర్వహించారు. వైద్యులు ఉచిత బిపి, షుగర్,  బిఎండి టెస్ట్ లు చేయడంతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరంలో డాక్టర్ అభిషేక్ బార్లీ  దాదాపు 300 మందికి  పరీక్షలు చేశారు