13 June, 2026 | 6:59 PM

Breaking News

గాలికి కూలిన ఇంటికి చేయూత - 'మీకోసం మేమున్నాం టీం' ఆర్థిక సహాయం

13-06-2026 06:14 PM

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండలం, ఆర్ కొత్తగూడెం యస్సి  కాలనీకి చెందిన కూరపాటి వెంకటేశ్వరావు, శ్రీదేవి దంపతుల రేకుల షెడ్డు ఇల్లు ఇటీవల వీచిన గాలిదుమారాలకు కూలిపోయింది. రోజువారీ కూలీతోనే జీవనం సాగించే వీరికి ఇల్లు బాగుచేయించుకునే స్థోమత లేకపోయింది. ఎండ, వానకు నిలువ నీడ లేని పరిస్థితిలో 'మీకోసం మేమున్నాం టీం'ను ఆశ్రయించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫండ్ రైజ్ చేసి సేకరించిన రూ.9,500ను శనివారం చర్లలోని సంస్థ కార్యాలయంలో సభ్యులు కార్తికేయ రోహిత్ వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుతో రోడ్డున పడిన ఈ కుటుంబాన్ని చూసి బాధ కలిగిందన్నారు. కష్టంలో ఉన్న పేదవారికి మనమంతా చేయి అందిస్తే వారికి పెద్ద భరోసా అవుతుందని పిలుపునిచ్చారు.