13 June, 2026 | 6:36 PM

TET నుండి మినహాయింపు ఇవ్వాలి

13-06-2026 05:18 PM

బైంసా,(విజయక్రాంతి): ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు NCTE నిబంధనలకు అనుగుణంగా 2025 ,1సెప్టెంబర్ లో సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు శశికాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సర్వీస్ ఉపాధ్యాయులు 65 రివ్యూ పిటిషన్ వేశారు. నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్ట్ ఆ రివ్యూలను కొట్టివేస్తూ 2028 ఆగష్టు 31 లోపు ఇన్ సర్వీస్ టీచర్స్ కు చివరి అవకాశంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

దీని ప్రకారం సర్వీస్ రిమూవ్ చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో 30,000 మంది ఉపాధ్యాయులకు TET పాస్ కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా హక్కు చట్టం అమలు ద్వారా TET అంశం ప్రస్తావన  దీనిపై ప్రభుత్వం ఆలోచన చేసి ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. గత 30 సం అసంబద్ద నిర్ణయం ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలిపారు. ప్రధాన కార్యదర్శులు , సుదర్శన్ జిల్లా బాధ్యులు కీర్తి సాయన్న, వాసుదేవ రెడ్డి, అనుముల అరుణ్ , అశ్విన్ కుమార్ లు  పాల్గొన్నారు.