అంగన్వాడీలే ముద్దు.. ప్రీ ప్రైమరీ స్కూళ్లు వద్దు..
పేద పిల్లలకు అంగన్వాడీయే దిక్కు
ప్రీ ప్రైమరీ నిర్ణయంపై గ్రామస్తుల అసంతృప్తి
అంగన్వాడీల బలోపేతమే లక్ష్యం
ప్రీ ప్రైమరీ పేరుతో వ్యవస్థ నిర్వీర్యం చేయొద్దు
కొత్తపల్లిలో తల్లుల నినాదం.
చర్ల,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్ల పేరుతో అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని, అంగన్వాడీలనే బలోపేతం చేయాలని కొత్తపల్లి గ్రామ తల్లులు డిమాండ్ చేశారు. చర్ల మండలపరిధిలోని కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, కొత్తపల్లి సర్పంచ్ నాగలక్ష్మి, సిఐటియు అంగన్వాడీ యూనియన్ నాయకురాలు రాధాకుమారి పాల్గొన్నారు.
శనివారం నిర్వహించిన ఈ సమావేశంలో 'ప్రీ ప్రైమరీ స్కూళ్లు వద్దు.. అంగన్వాడీలే ముద్దు' అనే నినాదంతో తల్లులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన విద్య, తల్లులకు అవగాహన అంగన్వాడీల్లోనే సాధ్యమని, ప్రీ ప్రైమరీ పేరుతో కొత్త వ్యవస్థ అవసరం లేదని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని అంగన్వాడీలనే నడిపించాలని సమావేశం తీర్మానించింది.






