3 April, 2026 | 4:59 AM

నేడు మంత్రి జూపల్లి పర్యటన

03-04-2026 01:03 AM

ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు

నిర్మల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైద రాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మంచిర్యాల జిల్లాకు చేరుకుంటారు. అక్కడ ప్రజా పాలన పాల్గొని కలెక్టర్ కార్యాలయం లో సమీక్ష చేస్తారు. ౧:30 నిమిషాలకు అదిలాబాద్ జిల్లా ఈనెల 6న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పిప్పిరిలో పరిశీలిస్తారు. అక్కడినుండి బాస ర త్రిబుల్ ఐటీకి చేరుకొని బాసర టెంపుల్ 100 కోట్ల ప్రణాళిక ఏర్పాట్లను పరిశీలించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.