23 April, 2026 | 1:25 AM

ఆదివాసీల ప్రగతి దిశగా వినూత్న అడుగు

23-04-2026 12:00 AM

పర్యాటక ఎక్స్ పోజర్ ప్రోగ్రాంను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఉట్నూర్, ఏప్రిల్ 2౨ (విజయక్రాంతి): ఆదివాసీ గూడల ప్రజల్లో చైతన్యం నింపడం, వారిని ఆధునిక సమాజంతో మమేకం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడెంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ‘ఆదివాసీ టూరిజం ఎక్స్ పోజర్ ప్రోగ్రామ్‘ ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజు మర్మట్‌లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

గిరిజన సంక్షేమ శాఖ, పర్యాటక శాఖల సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 6 ప్రత్యేక బస్సుల్లో సుమారు 250 మంది ఆదివాసీలను విద్యా, సాం స్కృతిక యాత్రలో బాగంగా హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ యాత్ర లో భాగంగా ఆదివాసీలు హైదరాబాద్ నగరంలోని చారిత్రక, విద్యా, సాంస్కృతిక ప్రదే శాలను సందర్శించనున్నారు. బుధవారం మధ్యాహ్నం వారు తారామతి బారాదరి చేరుకోగా, అక్కడి నుండి రెండు రోజులపాటు పర్యటన కొనసాగుతుంది.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వం లో ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నగర సంస్కృతి, ఆధునిక అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించడం ద్వారా ఆదివాసీలలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు, యువతలో ఉన్నత విద్యపై ఆసక్తి పెంచడం, సమాజంలో మార్పుకు దారితీయ డం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కామ్డే, మాజీ ఎంపీ సోయం బాపురావ్‌ల, మాజీ ఎమ్మెల్యే  ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, గండ్రత్ సుజాత, సాజిద్ ఖా న్, శ్రీకాంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ఆడే గజేందర్ పాల్గొన్నారు.