మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత
గడ్డపోతారం ప్రజా ప్రతినిధులు, కమిషనర్
జిన్నారం, ఆగస్టు 21: ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమం హెచ్ఎండిఏ ఏడి చక్రపాణి , ఎఫ్ ఆర్ వో దీపిక ఆధ్వర్యంలో గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాధారం గ్రామ వార్డు ఆఫీస్ నందు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు.
గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు వనమహోత్సవ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని గడ్డపోతారం మున్సిపాలిటీని పచ్చదనంతో నింపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గడ్డపోతారం మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ తాన్య, కౌన్సిలర్లు మల్లేష్ ముదిరాజ్ , స్వాతి గణేష్ సింగ్ , నవీన్, కో ఆప్షన్ మెంబర్ రాయిసా ఖాతూన్ స్థానిక నాయకులు, యువకులు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






