21 August, 2026 | 7:28 PM

ప్రతి విద్యార్థి చదివి రాయాలి

21-08-2026 03:24 PM

నిర్మల్ ,ఆగస్టు 21 ( విజయ క్రాంతి): జిల్లాలో విద్యాసంస్థలు చదువుతున్న ప్రతి విద్యార్థి చదవడం రాయడం తప్పనిసరి అని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. శుక్రవారం రోజున నా మాటలు నా కథ పిల్లల పట్టణ సంస్కృతి బలోపేతం చేసినందుకు రీడ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ నరసయ్య, కమ్యూనిటీ మొబిలేషన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ స్టాటికల్ కోఆర్డినేటర్ లింబాద్రి, రీడ్ టు ఇండియా హోమ్ కోఆర్డినేటర్ విజయకుమార్ తదితరులు ఉన్నారు.