21 August, 2026 | 12:12 PM

Breaking News

ఆటోనగర్ ఏర్పాటుకు నూతన కార్యవర్గం ఎన్నిక   •   వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు   •   ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •   హైదరాబాద్‎కు మాజీ సీఎం జగన్.. భారీగా వెలిసిన కటౌట్లు   •   వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, తోరం కట్టే సంప్రదాయం ఇదే!   •   క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం   •  

కుటుంబ సర్వేలో గంగపుత్రులను చేర్చాలి

23-04-2026 12:00 AM

బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు టీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ ఖన్నా వినతి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): సమగ్ర కుటుంబ సర్వే నివేదిక లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్నికుల క్షత్రియ కులాన్ని సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ నుంచి తొలగించాలని తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యద ర్శి టంగుటూరి రాజేష్ ఖన్నా పేర్కొన్నారు.

బుధవారం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని టంగు టూరి గంగపుత్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు అందజేశారు. తెలంగాణలో ఉన్న సనాతన సాంప్రదాయ మత్స్యకార కులస్థులైన బెస్తగుండ్లతో కలిపి గంగపుత్రులను ప్రధాన కులంగా సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్‌లో చేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.