21 August, 2026 | 4:34 PM

Breaking News

తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •   ఏఐవైఎఫ్ తాండూర్ మహాసభలను జయప్రదం చేయండి   •  

పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను ఉపయోగించుకోవాలి

21-08-2026 03:21 PM

నిర్మల్, ఆగస్టు 21 ( విజయ క్రాంతి): తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పదవ పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఈనెల 23వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్టు పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బూర ఉమా శంకర్ తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రము బాగ్ లింగంపల్లి హైదరాబాదు నందు ఈ పరిచయ వేదిక ఉంటుందన్నారు. తెలంగాణలోని 31 జిల్లాలు చెందిన వధూవరులు ఈ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకుకోవడం  మంచి అవకాశం అని పేర్కొన్నారు. కావున పద్మశాలి కుల బంధువులు ఉపయోగించుకోవలసిందిగా కోరారు. పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ వేదిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.