22 June, 2026 | 3:46 PM

ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్

22-06-2026 02:41 PM

ఆర్థిక సాయం అందజేసి ధైర్యం చెప్పిన జనక్ ప్రసాద్

గోదావరిఖని, జూన్ 22(విజయక్రాంతి): ఐఎన్ టియుసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఉడుత శంకర్ యాదవ్ తండ్రి, ఉడుత రాయమల్లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్, ఐఎన్ టియు సిసెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ సోమవారం వారి నివాసానికి చేరుకుని పరామర్శించారు.

మెరుగైన వైద్యానికి భరోసా

ఈ సందర్భంగా రాయమల్లు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జనక్ ప్రసాద్, ఆందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు. "మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ప్రముఖ ఆసుపత్రులతో మాట్లాడి చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు తెలియజేయండి" అని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా రాయమల్లు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ పరామర్శలో ఐఎన్ టియుసి ఆర్.జి.3 వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ సెక్రెటరీ బండ కిరణ్ రెడ్డి, మల్లూరి మల్లారెడ్డి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, వడ్డేపల్లి దాస్ తదితరులు పాల్గొన్నారు.