22 June, 2026 | 4:13 PM

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

22-06-2026 02:43 PM

కొత్తబాది కేజీవీబీ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ లత...

బాన్సువాడ, జూన్ 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొత్తబాది కస్తూర్బా గాంధీ పాఠశాలలో బయోలాజికల్ సైన్స్, పీఈటి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయ లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో ఖాళీగా ఉన్న బయోలాజికల్ సైన్స్ పోస్టుకు డిగ్రీతోపాటు బి.ఎడ్ పూర్తి చేసి టెట్ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా పీఈటి పోస్ట్ కు బి పెడ్ పూర్తి చేసి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. అభ్యర్థుల రెస్యూమ్ తో పాటు సర్టిఫికెట్లు జిరాక్స్ లు జత చేసి కొత్తబాది కస్తూర్బా గాంధీ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజయ లత కోరారు.