22 June, 2026 | 3:53 PM

డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం

22-06-2026 02:35 PM

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి(Bhupalpally) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విధినిర్వహణలో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకన్న( DTO Venkanna) మృతి  తీవ్ర దిగ్బ్రాంతి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం(Bhupalpally Transport Department Office) వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వెంకన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధినిర్వహణలో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.