అంగన్ వాడి కేంద్రంలో చిన్నారుల పస్తులు
సిలిండర్ లేక చిన్నారులకు వండి పెట్టని భోజనం...
నాలుగు రోజులుగా కేంద్రానికి రాని చిన్నారులు
పట్టించుకోని ఐసిడిఎస్ అధికారులు
బాన్సువాడ,(విజయక్రాంతి): ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో చిల్లరలకు పౌష్టికాహారం అందజేయాలంటూ ఉన్నతంగా పౌష్టికంగా చిన్నారులను తయారు చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అన్ని రకాల పౌష్టిక ఆహార పదార్థాలను అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేయడం జరుగుతుంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం యధా రాజా తథా ప్రజా అన్నట్టు వ్యవహార శైలి కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో తాండాలలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని చెప్పవచ్చు. అంతేకాకుండా చిన్నారులకు అందవలసిన పౌష్టికాహారం గుడ్డు ఇతరత్రా విటమిన్ పదార్థాలు అందక ఇంటికే పరిమితం అవుతున్న సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్త బాది గ్రామ అంగన్వాడి కేంద్రంలో దుస్థితి నెలకొంది.
ఈ అంగన్వాడి కేంద్రంలో నాలుగు ఐదు రోజులుగా సిలిండర్ కొరత ఉండడంతో చిన్నారులకు వండి పెట్టవలసిన భోజనం పౌష్టిక ఆహార పదార్థాలు వండకపోవడంతో చిన్నారులను ఇంటికే పరిమితం చేస్తూ అంగన్వాడి టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం అని గ్రామస్తులు పేర్కొనడం గమనార్హం. ఉదయం కేవలం ఆయా మాత్రమే అంగన్వాడి కేంద్రానికి వెళ్లి శుభ్రపరిచి కూర్చోవడం తప్ప ఏమి పని లేదని చెప్పడం విశేషం.
అదేవిధంగా ఈ అంగన్వాడీ కేంద్రానికి అంగన్వాడీ టీచర్ లేకపోవడం సంతోష్ నగర్ తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ ఈ కేంద్రానికి ఇన్చార్జి టీచర్ గా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ ఈ కేంద్రం వైపు కన్నెత్తి చూడకపోవడం చిన్నారులు వస్తున్నారా లేదా అని తెలుసుకోకపోవడం ఆ అంగన్వాడి టీచర్ విధుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం అవుతుంది. నాలుగైదు రోజులుగా అంగన్వాడి కేంద్రానికి చిన్నారులు రాకపోవడం వారికి అందవలసిన పౌష్టికాహారం భోజనం వండి పెట్టకపోవడం అంగన్వాడి కేంద్రం వైపు కన్నీటి చూడకపోవడం పట్ల ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ తిరుపతి గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీచర్ల పట్ల అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పట్ల బాన్సువాడ సిడిపిఓ పర్యవేక్షణ లేకపోవడంతో పాటు కేంద్రాల వైపు సిడిపిఓ కన్నీటి చూడకపోవడం వారి పనితీరుకు నిదర్శనం అని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. సిడిపిఓ జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయకపోవడమే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వండి పెట్టవలసిన భోజనం వండి పెట్టి చిన్నారులను అంగన్వాడి కేంద్రంలో విద్యను అభ్యసించి పౌష్టికాహారం అందజేయాలని గ్రామ ప్రజలు చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై విజయ క్రాంతి బాన్సువాడ సిడిపిఓ సౌభాగ్య ను వివరణ కోరగా సిలిండర్ కొరత వలన చిన్నారులకు భోజనం వండి పెట్టలేదని నిజమని పేర్కొనడం జరిగింది. ఇప్పటినుండి చిన్నారులకు అంగన్వాడి కేంద్రానికి పిలిపించి పౌష్టికాహారం అందజేస్తామని పర్యవేక్షణ చేపడతామని ఆమె తెలిపారు.






