నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన హీరో అల్లు అర్జున్
22-06-2026 03:46 PM
నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్
హైదరాబాద్: సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Film actor Allu Arjun) నాంపల్లి కోర్టులో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. షూటింగ్ కారణంగా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ హాజరుకాలేదు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు కోర్టు అనుమతిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో(Sandhya Theatre Stampede Case) అల్లు అర్జున్ ఏ 11గా ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును నాంపల్లి కోర్టు జులై 6వ తేదీకి వాయిదా వేసింది. Pushpa 2: The Rule (పుష్ప 2: ది రూల్) సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా,ఆమె కొడుకు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.






