రేవంత్ మోసాలను ఎండగట్టే బాధ్యత.. రైతులు తీసుకోవాలి: హరీశ్
రైతుబంధు లేదు, రైతు బీమా లేదు
రైతులను రేవంత్ సర్కార్ మోసం: హరీశ్ రావు
కార్యకర్తల సమావేశంలో హరీష్ మాట్లాడుతుండగా పవర్ కట్
అచ్చంపేట: ఎన్నికల ముందు వరకు వడ్లు పండిస్తే కొంటామన్నారు.. ఇప్పుడు కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో( Achampet constituency BRS party workers meeting) హరీశ్ రావు మాట్లాడుతూ... యాసంగికి 50 లక్షల టన్నుల కొనుగోలుకే కేంద్రం ప్రభుత్వం(Central Government) అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి అదే 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారని తెలిపారు. సగం వడ్లు కొంటే మిగతా సగం రైతులు బయట అమ్ముకోవాలన్నారు. రుణమాఫీ, రైతుబంధు, పంట కొనుగోలులో మోసం ప్రభుత్వానిదన్నారు.
పాలమూరు జిల్లాలో ఒక్క సీటు మొలకెత్తనీయం అని చెబుతున్నారు. రేవంత్ సర్కార్(CM Revanth Reddy) లో రైతులకు బోనస్ రావడం లేదు, రైతులకు కనీసం కరెంట్ కూడా ఇవ్వండం లేదు, రేవంత్ ప్రభుత్వం పూర్తిగా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రేవంత్ మోసాలను ఎండగట్టే బాధ్యత రైతులు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు ఎప్పుడైనా అగిందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రైతుబంధు లేదు, రైతు బీమా కూడా లేదన్నారు. రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మోసం చేసిన వీడియోలను హరీష్ రావు కార్యకర్తల ముందు ప్రదర్శించారు. అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతుండగా పవర్ కట్ కావడం విశేషం.






