దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తాడూరు మండలం సిర్సివాడ గ్రామం వద్ద దుందుభి వాగుపై రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సోమవారం రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో సిర్సివాడతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లు రవి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, అనిరుధ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం తదితరులు పాల్గొన్నారు.






