18 May, 2026 | 2:50 AM

జడ్చర్ల నూతన మున్సిపాలిటీ కమిషనర్‌గా యం. గిరీష్

18-05-2026 01:45 AM

జడ్చర్ల, మే 17 : జడ్చర్ల మున్సిపాలిటీ నూతన కమిషనర్ యం. గిరీష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే జడ్చర్ల లో ఇటీవల భారీ వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించారు. ఇంటిలో నివాసం ఉండే వారిని పునరావాస కేంద్రం ఎస్సీ కమ్యూనిటీ హాల్ లోకి వెళ్లాలని సూచించారు. అ పట్టణంలో శానిటేషన్, డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్బంగా మేనేజర్ లక్ష్మన్న,ఆఫీస్ వివిధ సెక్షన్ల అధికారులకు, సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు ఇచ్చారు.