1 September, 2026 | 11:17 PM

Breaking News

పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి   •   'అంబేద్కర్ అభయహస్తం' లబ్ధిదారులు ఎందరు?   •   రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •  

కొద్దిపాటి వర్షాలకే కూలిన ఇల్లు

04-07-2026 | 07:51pm

అశ్వారావుపేట,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న కొద్ది పాటి వర్షాలకు తాటాకు ఇల్లు కూలిన సంఘటన  శనివారం నాడు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని దబ్బతోగు కాలానికి చెందిన సున్నం శ్రీదేవి మట్టి గోడలతో నిర్మించిన తాటాకు ఇంటిలో నివాసం ఉంటున్నారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి గోడలు నాని ఇల్లు మొత్తం కూలిపోయింది. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోయినా, తల దాచుకోవడానికి నిలువ నీడ లేకుండా పోయింది. ఇంటిలోని  తిండి గింజలు, సామానులు మట్టి దిబ్బలు కింద పడిపోయాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు  కన్నీరు మున్నీరు అవుతుంది.