చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
11-04-2026 09:03 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రైతు కష్టపడి పండించిన ప్రతి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి,ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం మండల పరిధిలోని కుంచమర్తి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.




