4 July, 2026 | 9:47 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ

04-07-2026 08:10 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ ఆర్టీసీ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.ఎవి గిరిసింహా రావు ఖమ్మం ఆర్టీసీ ఆసుపత్రి కి బదిలీ అయ్యారు. కరీంనగర్ లో పనిచేసిన అనతి కాలంలో జోనల్ హాస్పిటల్ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ఎంతో కృషి చేశారు. మానిటర్స్,డిజిటల్ మొబైల్ ఎక్స్ రే, స్కానింగ్,ఎమర్జెన్సీ కేర్ యూనిట్, డే కేర్ లాబ్ సిబ్బంది నియామకం,అప్రోచ్ రోడ్, ప్లాంటేషన్,బాక్ గేట్,సైన్ బోర్డ్ తదితర హంగులతో హాస్పిటల్ రూపురేఖలు మార్చారు. ముందు గార్డెన్ లో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీ ల పై రిటైర్డ్ ఉద్యోగులు సేద తీరే విధంగా తీర్చిదిద్దారు. బదిలీపై వెళ్తున్న డాక్టర్ గిరిసింహారావు మాట్లాడుతూ దాదాపు 18 నెలల కాలం కరీంనగర్ జోనల్ హాస్పిటల్లో విధులు నిర్వహించడం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రిని ఉన్నతీకరించే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.