27 March, 2026 | 4:07 AM

ఈ స్పోర్ట్స్ నేషన్స్ కప్ 2026 జాతీయ జట్టు భాగస్వామిగా నాడ్విన్ గేమింగ్

27-03-2026 02:26 AM

పంజాగుట్ట, మార్చి 26(విజయక్రాంతి): ఈస్పోర్ట్స్ నేషన్స్ కప్-2026 కోసం భారత జాతీయ జట్టు అధికారిక భాగస్వామిగా ప్రముఖ గేమింగ్ సంస్థ నాడ్విన్ గేమింగ్ను ఈస్పోర్ట్స్ ఫౌండేషన్ నియమించింది. హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన కార్యక్ర మంలో ఈ స్పోర్ట్స్ ఫౌండేషన్ గ్లోబల్ హెడ్ నిమిశ్ రౌత్తో పాటు నాడ్వి న్ గేమింగ్ డైరెక్టర్ హన్స్ జాగ్నో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా దేశంలో గేమిం గ్ రంగాన్ని ప్రోత్సహించడంలో నాడ్విన్ గేమింగ్ పోషిస్తున్న కీలక పాత్రను గుర్తించి బాధ్యతలను వారికి అప్పగించామన్నారు.

ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీలు రియాద్ వేదికగా ఈ ఏడాది నవంబర్ 2 నుంచి 29 వరకు జరగనున్నాయన్నారు. భారత ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా తీర్చిదిద్దడ ంలో నాడ్విన్ గేమింగ్ క్రియాశీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. బలమైన జాతీయ జట్టును నిర్మించడం, క్రీడాకా రులకు కోచ్ల ద్వారా శిక్షణ ఇప్పించడం, పబ్లిష ర్లతో సమన్వయం చేసుకుంటూ ఆటగా ళ్లకు అవసర మైన అన్ని వసతులను ఈ సంస్థ కల్పిస్తుందని వెల్లడించారు. దేశంలోని గేమింగ్ క్రియేటర్లు, ప్లేయర్లు, ఇతర భాగస్వాముల మధ్య వారధిగా ఉంటూ ప్రపంచ వేదికపై భారత్కు ధీటైన విజయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలియజేశారు.