14 July, 2026 | 4:08 PM

Breaking News

ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •  

విద్యుత్ షాక్‌తో పాడిగేదె మృతి

14-07-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 13: విద్యుత్ షాక్ తో పాడిగేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేల్పుచర్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత రైతు ఉగ్గం సంతోష్,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే తన పాడి గేదె గ్రామ సమీపంలోని ప్రాంతానికి మేతకు తీసుకెళ్లగా అక్కడ మేతమేస్తున్న క్రమంలో అప్పటికే తెగిపడిన విద్యుత్ ఎల్టీ లైన్ వైరు తగిలి గేదె అక్కడికక్కడే మృతి చెందింది.మృతి చెందిన పాడి గేదె విలువ రూ.40 వేలు ఉంటుందని,ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత రైతు సంతోష్ వేడుకున్నాడు.