14 July, 2026 | 3:18 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

మణిదీప్ రెడ్డి కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ

14-07-2026 12:00 AM

ఎల్బీనగర్, జులై 13 : ఫిన్లాండ్ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన ఎల్బీనగర్ నియోజకవర్గం, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కు చెందిన మణిదీప్ రెడ్డి కొన్ని నెలలుగా కనిపించకపోవడం రెండు రోజుల ముందు ఫిన్లాండ్ భారత రాయబార సంస్థ నుంచి మణిదీప్ రెడ్డి సముద్రంలో మునిగి చనిపోయాడని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హర్యానా మాజీ గవర్నర్ బం డారు దత్తాత్రేయ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థి త ల్లిదండ్రులు దత్తాత్రేయతో మాట్లాడుతూ... తమ కుమారుడు మరణించలేదని ఎవరిదో శవం చూపించి తమ కుమారుడు అని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలు గా సముద్రంలో ఒక వ్యక్తి మునిగిపోతే మృ తదేహం కుళ్ళిన స్థితిలో ఉంటుందని, కానీ ఫింగర్ ప్రింట్ ఆధారంగా తమ కుమారుడని ఆ దేశం ఎలా నిర్ధారిస్తుందని? ప్రశ్నిం చారు. అక్కడ దొరికిన మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని, తమ కుమా రుడు బతికే ఉన్నాడన్న నమ్మకం తమకు ఇంకా ఉందని అన్నారు.

ఒకవేళ డీఎన్‌ఏ టె స్ట్ చేస్తే అది తమ కుమారుడు శవమే అని తేలితే ప్రభుత్వమే చొరవ చూపి ఆ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని కోరా రు. బండారు దత్తాత్రేయ ఫిన్లాండ్ లోని భా రత రాయబార సంస్థతో మాట్లాడి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని మాజీ గవర్నర్ దత్తాత్రేయ హామీ ఇచ్చారు.