వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండలంలోని ఎంపీపీఎస్ వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆశాజ్యోతి సేవా సంస్థ, సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సేవా సంస్థ ప్రతినిధులు కోనా మోహనరావు, కుడుముల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, ఒక జత దుస్తులను గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రి వెంకటేశ్వరరావు, మండల కెమిస్ట్రీ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి సుధాకర్ రెడ్డి, వేముల వెంకటేశ్వరరావు, పారిశుద్ధ్య కార్మికురాలు గౌర్రాజు లక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






