1 August, 2026 | 2:53 AM

అమాంతం పెరిగిన మైక్రోసాఫ్ట్ సంపద

01-08-2026 01:47 AM

షేర్ల ద్వారా ఒక్కరోజులోనే 42 లక్షల కోట్ల ఆదాయం

న్యూయార్క్, జూలై 31: మైక్రోసాఫ్ట్ సంస్థ షేర్లు అమెరికా స్టాక్ మార్కెట్‌లో తాజాగా భారీగా పెరిగి సంపదలో చరిత్ర సృష్టించాయి. కేవలం 24 గంటల్లో 450 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 42 లక్షల కోట్లకు పైగా) 16 శాతం పెరిగాయి. సంస్థ షేర్ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని చరిత్ర సృష్టించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గతేడాది ఎన్విడియా షేర్లు కూడా ఇదే స్థాయిలో పెరిగినా, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్ల అధికంతో కొత్త రికార్డును సృష్టించినట్లయ్యింది.

మైక్రోసాఫ్ట్ బుధవారమే త్రైమాసిక ఫలితాలను ప్రకటించి 43 శాతం వృద్ధి నమోదును వెల్లడించింది. ఏఐకు ఆదరణ, వినియోగదార్ల సంఖ్య 3 కోట్లు దాటిందని తెలిపింది. దీంతో మరుసటి రోజు సంస్థ షేర్లు 16 శాతం లాభాలను సాధించాయి. 2008 తరువాత ఈ స్థాయిలో సంస్థ షేర్ విలువ పెరిగింది. ఇంకోవైపు మెటా షేర్లు మాత్రం డోలాయమానంలో కొనసాగుతూ.. చివరకు 8 శాతం నష్టాలను మూటగట్టుకొని మదుపర్లను నిరాశలోకి నెట్టాయి. ఏఐలో మెటా పెట్టుబడులు పెడుతుండడమే నష్టాలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు.