పకడ్బందీగా పోలీస్ నియామకాలు
- పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా
- అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ ను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రి యపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి.
ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించి పారదర్శకత, నియమ నిబంధనల ఆచరణ, ప్ర త్యేక నిఘా, భద్రత, దుష్ప్రచారాలను అరికట్టడం, సైబర్ సెక్యూరిటీ అప్రమత్తత తదిత రాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. ఈ అత్యవసర సమావేశంలో సీఎం ప్రి న్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, డీజీపీ సీవీ ఆనం ద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గో యల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, హైదరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.






