5 August, 2026 | 1:12 AM

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

05-08-2026 12:04 AM
  1. విద్యావైద్యంపై మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టి
  2. పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు 
  3. క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన 

మహాదేవపూర్, ఆగస్టు 4 (విజయక్రాం తి): ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. విద్యా వైద్యంపై మంత్రి శ్రీ ధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించి లక్షలాదిమంది యువత ప్రజలకు వివిధ రకాల సహా య సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. మహాదేవపూర్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రిలో సువర్ణ వనమాల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రై శిబిరంలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యతో పేదరికాన్ని జయించి ఉన్నతంగా ఎదగవచ్చని అన్నారు. ఈ క్ర మంలో మంథని నియోజకవర్గాన్ని విద్యావంతుల నియోజకవర్గ ఏర్పాటుతో పాటు వైద్య పరంగా క్యాన్సర్ ఫ్రీ గా మార్చడానికి తన అత్త సువర్ణ వనమాల జ్ఞాపకార్థం క్యాన్స ర్ శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు.

మం థని ప్రజలకు రుణపడి ఉంటామని మం థని నియోజక వర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని అన్నారు.ఇప్పటి వరకు 1,258 వైద్య శిబిరాలు నిర్వహించామని 25,750 క్యాటరాక్ట్ ఆపరేషన్లు,40వేల మందికి ఇంటర్నేషనల్ స్టాండ్ కళ్లద్దాలు అందించామని, 8వేల అమ్మాయిలకు అవసరమైన టెస్టులు, 40క్యాన్సర్ క్యాంపులు, 25 డెంటల్ క్యాంపు లు 2 వేల మంది పిల్లలకు గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయించామని అన్నారు.

రాబోవు రోజు ల్లో ప్రతీ మండలకేంద్రంలో మరెన్నో వైద్య శిబిరాలు నిర్వహించి మంథని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు. ఈసందర్భంగా అన్నీ తానై వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న మహేంద్ర యాదవ్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ దుద్దిళ్ల కుటుంబ వ్యక్తి గా తమ ఐదవ తమ్మునిగా అభివర్ణిస్తూ ఆ యన చేస్తున్న సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు,సర్పంచ్ హసీనా బాను, పీఏసీఎస్ చైర్మెన్ తిరుపతి రెడ్డి, పాల్గొన్నారు.