27 April, 2026 | 4:20 AM

ఆటలతో మానసిక, శారీరక ఆరోగ్యం

27-04-2026 02:31 AM

డా హిప్నో పద్మా కమలాకర్, యోగా గురు సరోజని రామారావు

ముషీరాబాద్, ఏప్రిల్ 26(విజయక్రాంతి): ఆటలతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటా రని కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్, యోగా గురు సరోజని రామారావు అన్నారు. డా. హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవ, వనితా భారత్ లైయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఆదివారం దోమలగూడలోని రామకృష్ణ మఠం బాలల సేవా విభాగంలో వేసవి సెలవులు ప్రారంభం సందర్భంగా ఆటలతో ఆరోగ్యం అనే ప్రత్యేక కార్యక్రమం ఉత్సాహం గా నిర్వహించారు.

ఈ సందర్భంగా పిల్లల కోసం 2 నిమిషాల ధ్యానం పోటీలు నిర్వహించి, వారి ఏకాగ్రత, మానసిక ప్రశాంతతను పెంపొందించేలా చేశారు. పిల్ల లు డ్యాన్స్, పాటలతో అలరించారు. పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు స్కిప్పింగ్ రోప్స్, బాల్స్, క్రేయాన్స్, కథల పుస్తకాలను యోగా గురు సరోజని రామారావు, డా. హిప్నో పద్మా కమలాకర్, ఆరతి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఆటలు, ధ్యానం ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితమవుతూ శారీరక కదలికలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇ లాంటి సమయంలో ‘ఆటలతో ఆరోగ్యం’ వంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. అలాగే ధ్యానం పిల్ల లలో ఏకాగ్రత, సహనం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు.