ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి
12-07-2026 02:16 PM
బోథ్(విజయక్రాంతి): అర్హుడైన ప్రతి వ్యక్తి ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటరుగా నమోదు చేయించుకోవాలని పిప్పల్ దరి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సూచనలు సలహాలు అందించారు. సకాలంలో ఎంయూనరేషన్ పారాన్ని అధికారులకు పూర్తి వివరాలతో అందించాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు భవిష్యత్తులో కొనసాగాలంటే అనిమరేషన్ ఫామ్ తప్పకుండా పూర్తి బయోడేటా తో అందించాలన్నారు. భాగ్యలక్ష్మి పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు పాల్గొన్నారు.






