అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ 43వ డివిజన్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు అందించేందుకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పొన్నం లక్ష్మి మొండయ్య, కార్పొరేటర్లు తోట అనిల్, APP చంద్ర , ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






