24 August, 2026 | 9:43 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •   డీజిల్‌ దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్‌   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జీపీఓ   •   మిలాద్ ఉన్ నబి కమిటీ సభ్యులతో పోలీసు కమిషనర్ సమావేశం   •  

సునంద రైస్ మిల్లును శాశ్వత నిషేధం విధించాలి

24-08-2026 08:28 PM

ప్రజల ఆరోగ్యం భద్రత ప్రమాణాలను పాటించాలి

ఎమ్మార్పీఎస్ నాయకులు కొత్తపల్లి రవి

గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రజావాసాల మధ్య నిర్వహిస్తున్న సునంద రైస్ మిల్లుకు తిరిగి అనుమతులు ఇవ్వకుండా శాశ్వత నిషేధం విధించాలని ఎమ్మార్పీఎస్ గరిడేపల్లి మండల అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో ఆర్. సరోజకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లు వల్ల కాలుష్యం, దుమ్ము, శబ్దం తదితర సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

గతంలో అధికారుల తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించినట్లు, విజిలెన్స్ అధికారులు ఎన్ఫోర్మేంట్ అధికారుల సంయుక్త దాడులలో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని మిల్లుకు పునఃప్రారంభ అనుమతులు ఇవ్వకూడదని కోరారు. అధికారులు స్పందించకపోతే ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.