27 April, 2026 | 10:23 PM

గోమాతలను రక్షించుకోవాలి

27-04-2026 08:29 PM

తహశీల్దార్ కు గోమాత సంర‌క్ష‌ణ‌ సమితి సభ్యులు వినతి  

మునిప‌ల్లి,(విజయక్రాంతి): గోమాతను రక్షించాలని కోరుతూ  గోమాత సంర‌క్ష‌ణ  మండ‌ల క‌మిటీ ఆధ్వ‌ర్యంలో  సోమ‌వారం నాడు ఉప త‌హసీల్దార్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ మండ‌ల అధ్య‌క్షుడు ప‌డ‌మ‌టి నాగిశెట్టి, మాజీ అధ్య‌క్షులు పోచ‌న్నగారి ఆంజ‌నేయులు, ఉపేంద‌ర్ లు మాట్లాడుతూ... గోవుల అక్రమ రవాణా, గోవుల వధను అరికట్టాలని,గోవులను సంరక్షించాలని, గోరక్షణ కోసం చ‌ట్ట పరమైన చర్యలు కఠిన  తీసుకోవాల‌ని కోరారు. అక్ర‌మంగా గోవులను స‌ర‌ఫ‌రా చేస్తున్న స‌ద‌రు వ్య‌క్తుల‌పై  కఠిన చర్యలు శిక్షలు విధించాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గోమాత సంర‌క్ష‌ణ క‌మిటీ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.