27 April, 2026 | 10:21 PM

చర్చలకు పిలవకపోతే కార్మిక ఆగ్రహానికి ఐటీసీ గురికాక తప్పదు

27-04-2026 08:32 PM

– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరిక

బూర్గంపాడు,(విజయక్రాంతి): కార్మిక సమస్యలపై ఐటీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోతే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో–కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్‌పాషా, బల్లెం నాగయ్యలు హెచ్చరించారు. సోమవారం 33వ రోజుకు రిలేనిరాహారదీక్షలు చేరుకోవడంతో దీక్షలకు బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కొండారెడ్డిలతో పాటు ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి మద్దతు పలికి కార్మికులకు అండగా ఉంటామన్నారు.

ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ... కార్మికులు తమ సమస్యలను దీక్షల రూపంలో యాజమాన్యానికి తెలియజేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కార్మికుల పోరాటాన్ని యాజమాన్యం పట్టించుకోవడంలేదని, ఇప్పటికే సమైక్య వైఖరితో కాంట్రాక్టు కార్మికులు సిద్ధంగా ఉన్నారని... రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం కానుందని హెచ్చరించారు. దీక్షలో సందిపాము బాబు, బోనం నాగిరెడ్డి, రేగుమూడి రాంబాబు, పొడుపూరి రాజు, దార్ల కవిత, కందాల వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, మేకల శేషమ్మ, కోడూరి శ్రీనివాసరావు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.